;
50 సంవత్సరాల వయస్సు గల జయ (పేరు మార్చడమైనది) 2020 డిసెంబరులో, తన ఎడమ ఛాతీ గోడపై అనేక నొప్పితో కూడిన అల్సరేటెడ్ నోడ్యూల్స్ తో ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ కి వచ్చారు. ఆమె తనకున్న సమస్య కారణంగా నిద్రపోలేకపోతోంది. తన ఎగువ లింబ్స్ లో ఉన్న నొప్పి మరియు వాపు కారణంగా ఆమె తన భుజాలను పరిమితంగానే కదిలించగలుగుతున్నారు. అంచనావేసిన మీదట, క్యాన్సరు ఆమె యొక్క కుడి రొమ్ము, ఊపిరితిత్తులు మరియు కాలేయానికి వ్యాపించినట్లుగా కనుగొన్నారు. ఆమెకు గల వైకల్యం ఆమె యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసింది.
ప్రణాళిక చేసిన చికిత్స, దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు అపాయాలను జయ మరియు ఆమె భర్తకు ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ టీమ్ వివరించారు. తదుపరి కొద్ది నెలల్లోనే, చికిత్సకు జయ బాగా స్పందించారు. జులై 2021 నాటికి జయ పూర్తిగా కోలుకోగలిగారు.
అల్సరుతోకూడిన నోడ్యూల్స్ పోవడం మరియు నొప్పి తగ్గడంతో, ఇప్పుడు ఆమె తన భుజాలను కదిలించగలుగుతున్నారు మరియు బాగా నిద్ర కూడా పోగలుగుతున్నారు.
ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ యొక్క సమకాలీన వైఖరి మరియు అత్యుత్తమ చికిత్స ప్రొటోకాల్స్ గురించిన వార్తలు బాగా వ్యాప్తిచెందాయి మరియు తమకు వచ్చిన రోగం తలరాత అని అనుకునే జయ లాంటి రోగులు కోలుకున్నారు.
ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో అందించబడుతున్న సరసమైన మరియు అత్యధిక నాణ్యమైన క్యాన్సరు చికిత్స పొందేందుకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారనే విషయంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రారంభించినప్పటి నుంచి ఈ కేంద్రానికి వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని క్యాన్సరు రోగులు ఇక్కడ చికిత్స పొందడానికి ముందుకొస్తున్నారు.