; గైడింగ్ లైట్స్
గైడంగ్ లైట్స
20 నవంబర్, 2021

గైడింగ్ లైట్స్

ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో రోగి నేవిగేటర్లు అయిన ఆరోగ్య సేవక్స్, సకాలంలో మరియు సరసమైన ధరకు చికిత్స పొందడానికి వీలుగా ఆరోగ్య సంరక్షణ సవాళ్ళ ద్వారా క్యాన్సరు రోగులకు మార్గదర్శనం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన 44 సంవత్సరాల జ్యోతి రెడ్డికి, కుడి రొమ్ముపై చిన్న గడ్డ కనిపించినప్పుడు హెచ్చరిక చిహ్నాలు కలిగాయి. అయితే, నొప్పి లేకపోవడంతో ఆమె దానిని విస్మరించారు. త్వరలోనే, ఇది పెరగడం ప్రారంభమైంది మరియు తీవ్రతరమైంది. సెప్టెంబరు 2020లో, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) నాన్- కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సి డిలు)పై నిర్వహించిన చైతన్య మరియు స్క్రీనింగ్ శిబిరానికి జ్యోతి హాజరయ్యారు.

స్క్రీనింగ్ తరువాత, తదుపరి రోగనిర్థారణ మరియు అంచనా కోసం రిఫరల్ ఆసుపత్రిని సందర్శించవలసిందిగా ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ టీమ్ జ్యోతికి సలహా ఇచ్చింది. సంరక్షణపై కొనసాగేందుకు వీలుగా రోగులకు మార్గదర్శనం చేసే ఆరోగ్య సేవక్ లేదా రోగి నేవిగేటర్ ని కూడా ఆమె సంప్రదించారు. ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లోని ఇలాంటి ఒక రోగి నేవిగేటర్ అర్చన బోలిగర్లకు, జ్యోతి కేసు గురించి ఆసుపత్రిలోని అవుట్ రీచ్ టీమ్ తెలియజేసింది. ఆమె వెంటనే అతనితో భేటీ కాగా గడ్డపై మరింతగా పరిశోధన చేయించుకోవలసిందిగా సలహా ఇచ్చారు. జ్యోతి విముఖగా ఉన్నప్పటికీ అర్చన వదలలేదు. వ్యాధిని నిర్థారణ చేయడం మరియు చికిత్స చేయడం ఎంత ముఖ్యమనే విషయంపై జ్యోతికి కౌన్సిల్ ఇచ్చారు.

జ్యోతి అక్టోబరు 2020లో అంతిమంగా ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ అవుట్ పేషెంట్ డిపార్టుమెంట్ ని సందర్శించగా బయాప్సీ చేయించుకోవలసిందిగా ఆమెకు సలహా ఇచ్చారు. పేథాలజీ పరీక్ష ఫలితాలు చేయగా ఆమెకు గ్రేడ్ 3 ఇన్ ఫిల్ట్రేటివ్ డక్ట్ సెల్ కార్సినోమా ఉన్నట్లుగా వెల్లడైంది. మరింత చికిత్స కోసం ఆమెను ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ రేడియేషన్ ఆంకాలజిస్టు వద్దకు తీసుకెళ్ళగా అప్పటి నుంచి ఆమె కోలుకున్నారు.

అర్చన సకాలంలో జోక్యంచేసుకోకపోయివుంటే, జ్యోతి క్యాన్సరు తీవ్రతరం అయివుండేంది, ఎందుకంటే ఇది ఇప్పటికే క్రిటికల్ దశలో ఉంది. ‘‘అవసరమైన వైద్య చికిత్స పొందడానికి నేను వాళ్ళకు (రోగులకు) మార్గదర్శనం చేసేందుకు నేను శాయశక్తులా ప్రయత్నించాను. అవసరం ఉన్న ప్రజలకు సహాయపడటం నాకు చాలా సంతోషం మరియు సంత్రుప్తి కలిగిస్తుంది’’, అంటున్నారు అర్చన.

 

 

విభిన్న అవరోధాలను అధిగమించడానికి రోగి నేవిగేటర్లు కమ్యూనిటి సభ్యులకు సహాయపడతారు.
విభిన్న అవరోధాలను అధిగమించడానికి రోగి నేవిగేటర్లు కమ్యూనిటి సభ్యులకు సహాయపడతారు.

 

 

చేతులు పట్టుకొనుట

జ్యోతి కథ ప్రత్యేకమైనది కాదు. ప్రజలు తమ వైద్య స్థితులు పోతాయనే కారణంగా వాటిని తరచుగా నిర్లక్ష్యం వహిస్తుంటారు.

సంక్లిష్ట వ్యాధి నిర్థారణ చేయబడినప్పుడు, లేదా ఒకటి ఉన్నట్లుగా తెలిసినప్పుడు ఇది వాళ్ళ యొక్క ఏకైక సవాలు కాదు, అనేక మంది రోగులు తల్లడిల్లిపోతారు. చాలా తరచుగా, ఎక్కడికి వెళ్ళాలి లేదా తరువాత ఏం చేయాలి అనే విషయంలో సలహా చెప్పేందుకు ఎవ్వరూ ఉండరు. దీనికి తోడు చికిత్స తీసుకొచ్చే ఆర్థిక భారం ఆందోళనను మరింతగా పెంచుతుంది, అత్యధిక రోగి కుటుంబాలు తదుపరి చికిత్స ఆలోచనను పూర్తిగా వదిలేస్తారు.

ఇలాంటప్పుడే ఆరోగ్య సేవకులు లేదా రోగి నేవిగేటర్లు వస్తారు.

ఆరోగ్య వ్యవస్థలోని సవివరమైన వాస్తవాల గురించిన పరిజ్ఞానంతో, సంక్లిష్టమైన, తరచుగా భయం కలిగించే, బహుళ స్టెప్ ల ప్రక్రియ చేయించుకోవడానికి రోగులకు సహాయపడేలా మరియు వైద్య చికిత్స పొందడంలోని లాజిస్టిక్స్ ని సులభం చేయడంపై నేవిగేటర్లకు శిక్షణ ఇవ్వడమైనది.

రోగులతో మరియు వాళ్ళ కుటుంబాలతో నేరుగా పనిచేస్తూ, రోగి నేవిగేటర్లు వైద్య దరఖాస్తులను నింపడం, ఆసుపత్రికి లేదా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడం, అవసరమైతే ఆర్థిక సహాయం కోసం ఏర్పాట్లు చేయడం లాంటి ప్రాపంచిక, అయినప్పటికీ అత్యావశ్యమైన పనులు చేయడానికి వాళ్ళకు సహాయపడతారు. రోగులు మరియు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు నిర్మించుకున్న సంబంధాలు సకాలంలో చికిత్స మరియు తగినంత సంరక్షణ అందేలా చేస్తాయి.

సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన రోగులకు రోగి నేవిగేటర్లు సహాయపడతారు, ప్రత్యేకించి అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు ఆరోగ్య సంరక్షణ పొందడానికి గల అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతారు. ఆ విధంగా, ప్రభావితమైన వ్యక్తులకు మెరుగైన ఆరోగ్య ఫలితాలను పెంపొందించడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు మరియు ఆరోగ్యసంరక్షణ స్థితిని పెంచేందుకు దోహదపడతారు.

ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
కొత్ు జీవిత్ం ఆరంభ్ం
కొత్త జీవితం ఆరంభం
ఆప్నన హసుం
ఆపన్న హస్తం