; కొత్ు జీవిత్ం ఆరంభ్ం
కొత్ు జీవిత్ం ఆరంభ్ం
25 ఫిబ్రవరి, 2022

కొత్త జీవితం ఆరంభం

ఎస్ వి ఐ సి ఎ ఎ ఆర్ లో సరసమైన ధరకు అందిస్తున్న క్యాన్సరు సంరక్షణ వల్ల ఆర్ లక్ష్మీ తమ ఆరోగ్యం మరియు విశ్వాస తిరిగి పొందగలిగారు.

క్యాన్సరు అనేక విధాలుగా సోకుతుంది. 77 సంవత్సరాల ఆర్. లక్ష్మీకి (పేరు మార్చడమైనది) తన రెండు కనురెప్పల లింఫోమా ద్వారా ఈ భయంకరమైన వ్యాధి సంక్రమించింది. ఫలితంగా ఆమె కంటిచూపు కోల్పోయారు మరియు తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. ఆమె కుటుంబం అణగారిన వర్గానికి చెందడం మరియు ఆర్థిక స్థితి వల్ల లక్ష్మీ బాధలు మరింతగా పెరిగాయి, ఫలితంగా ఆమె సకాలంలో ఆరోగ్య సంరక్షణ పొండానికి ఆటంకంగా మారాయి. ఫలితంగా, ఆమె కుటుంబం అవసరమైన పరీక్షలు చేయించుకోలేకపోయింది మరియు సుదీర్ఘ కాలం పాటు చికిత్సను కొనసాగించడం ఆమెకు కష్టమైంది. అనతి కాలంలోనే లక్ష్మీ డిప్రెషన్ లోకి వెళ్ళింది మరియు పూర్తిగా తన కుమారునిపై ఆధారపడుతోంది. ఆమె క్రమేపీ ఒంటరి జీవితానికి మారిపోయి బంధువులు మరియు ఇరుగుపొరుగు వారిని కలుసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. లక్ష్మీకి పరిస్థితులు తీవ్రతరం కావడం మొదలైనప్పటికీ, ఆమె కుటుంబానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) గురించి తెలిసింది. కుమారుడు ఆమెను ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ డే-కేర్ సెంటరుకు తీసుకొచ్చారు. ఆమెను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు వద్దకు పంపడమైనది. ఆమె రోగాన్ని నిర్థారణ చేసిన తరువాత, టీమ్ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి రేడియేషన్ థెరపికి పంపింది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్ సి జి) చికిత్స మార్గదర్శకాలను ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ అమలు చేస్తోంది. టెక్నాలజీ సహాయంతో, ప్రత్యేక కేసులను విచారించి చికిత్స మార్గాలను ప్రణాళిక చేయడమైనది. చికిత్స ప్రణాళిక లక్ష్మీకి సహాయపడింది. అనతి కాలంలోనే ఆమెకు వాపు మరియు నొప్పి పోయాయి. ఆమెకు అంతిమంగా కంటిచూపు పునరుద్ధరించబడింది. సంతోషకరమైన మరియు ధీమాగా ఉన్న లక్ష్మీ తన గ్రామానికి తిరిగొచ్చారు మరియు ఇప్పుడు మామూలు జీవితం గడుపుతున్నారు. చల్లని కబురు ఏమిటంటే చికిత్స సరసమైనది మరియు రోగి, ఆమె కుటుంబం చికిత్స కోసం ఎక్కువ దూరం ప్రయాణించవలసిన అవసరం కలగలేదు.

ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
గైడంగ్ లైట్స
గైడింగ్ లైట్స్
ఆప్నన హసుం
ఆపన్న హస్తం