; ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
11 మే, 2022

ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ

రోగులకు సరసమైన క్యాన్సర్ కేర్ సౌకర్యం మరియు సరసమైన సౌలభ్యం, ఇంటికి దగ్గరగా

తిరుపతికి చెందిన 65 సంవత్సరాల బైకు మెకానిక్ గుణశీలన్ (ప్రైవసీని కాపాడేందుకు పేరు మార్చడమైనది)కి ఊపిరితిత్తుల క్యాన్సరు ఉన్నట్లుగా నిర్థారణ చేయబడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది. ఇది అతన్ని మరియు అతని కుటుంబాన్ని కలిచివేసినప్పటికీ, చికిత్స వ్యయం మరియు నాణ్యమైన సంరక్షణ పొందడం పెద్ద ఆందోళనగా ఉంది.

అనువైన మరియు సరసమైన ఆప్షన్ల కోసం వెతికిన తరువాత, గుణశీలన్ కి ఇటీవల ప్రారంభించబడిన శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి ఎ ఎ ఆర్) గురించి తెలిసింది.

ఈ కష్ట కాలంలో అతనికి ఖచ్చితంగా అవసరమైన సపోర్టివ్ వాతావరణం ఎస్ వి ఐ సి ఎ ఎ ఆర్ కల్పించింది. ఇబ్బందులు లేని మరియు సత్వర అపాయింట్మెంట్ వ్యవస్థ నుంచి, సహాయపడే సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అతనికి కన్సల్టేషన్ మరియు అడ్మిషన్ ప్రక్రియలో మార్గదర్శనం చేశారు, సకాలంలో స్పందించే వైద్య టీమ్ అతను కీమోథెరపి సెషన్ ని ప్రారంభించడంలో జాప్యం లేకుండా చూసింది. కొత్త ఆసుపత్రి గుణశీలన్ మరియు కుటుంబ సభ్యులకు ఓదార్పు అనుభవం కల్పించారు.

చికిత్స ప్రోటోకాల్స్, కీమోథెరపి వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే వాటి గురించి వాళ్ళు అవసరమైన కౌన్సెలింగ్ పొందారు. మంచి అవగాహనపూర్వక నిర్ణయం తీసుకునేందుకు కావలసినంత సమాచారం ఉన్న గుణశీలన్, వెంటనే తన మొదటి దఫా కీమోథెరపి ని ప్రారంభించారు, మరియు ఇప్పుడు సానుకూల ఫలితాలు చూస్తున్నారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తన లాంటి  అణగారిన వర్గానికి చెందిన వ్యక్తికి ఆధునిక చికిత్స అందించినందుకు నేను ఎస్ వి ఐ సి ఎ ఎ ఆర్ కి రుణపడివున్నాను: ‘‘నేను ఇక్కడ పొందిన సంరక్షణ అత్యున్నతంగా మరియు సరసమైన ధరకు లభిస్తోంది’’ అని అన్నారు.

అధునాతన క్యాన్సరు చికిత్స పొందడం తరచుగా అనేక మంది రోగులకు కష్టంగా ఉంటుంది, ప్రత్యేకించి గ్రామీణ భారతదేశానికి చెందినవారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించవలసిన, ఎక్కువ కాలం తమ కుటుంబాలకు దూరంగా ఉండవలసిన వారికి మరియు స్పెషాలిటి క్యాన్సరు ఆసుపత్రుల్లో భారీ ఖర్చులు భరించే వారికి.

జబ్బు కలిగించే శారీరక మరియు మానసిక క్షోభే కాకుండా, అనుకోని ఆర్థిక ఇబ్బందులు కారణంగా అనేక మంది రోగులు మరియు వాళ్ళ కుటుంబాలు చికిత్సను ఆపేస్తాయి. అయితే, రోగులకు కరుణతోకూడిన సంరక్షణ మోడల్ తో క్యాన్సర్ చికిత్సను పునర్నిర్వచిస్తున్న ఎస్ వి ఐ సి ఎ ఎ ఆర్  లాంటి ఆసుపత్రుల వల్ల ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది.

సరసమైన ధరకు అత్యధిక నాణ్యమైన క్యాన్సరు చికిత్సను రోగుల ఇళ్ళకు దగ్గరగా తీసుకురావడం, క్యాన్సరు వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఎక్కువ మందిని కాపాడటానికి సహాయపడుతోంది. ఇంకా, వ్యాధి గురించి బాగా చైతన్యం కల్పించడం, ప్రజలు క్రమంతప్పకుండా క్యాన్సరు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం మరియు రోగులకు సహాయపడే విధానాలపై కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం, భారతదేశంలో క్యాన్సరు సంరక్షణ స్థితిని మరింతగా పెంచుతుంది.

సంరక్షణ నమూనా.

సరసమైన అధిక-నాణ్యత క్యాన్సర్ సంరక్షణను రోగుల ఇళ్లకు దగ్గరగా తీసుకురావడం వల్ల క్యాన్సర్‌కు గురయ్యే మరిన్ని జీవితాలను రక్షించడంలో సహాయపడుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అదనంగా, వ్యాధి గురించి మరింత అవగాహన కల్పించడం, సాధారణ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు వెళ్లేలా ప్రజలను ప్రోత్సహించడం మరియు రోగులకు మద్దతు ఇచ్చే మార్గాలపై కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణ స్థితిని మరింత మెరుగుపరుస్తాయి.

కొత్ు జీవిత్ం ఆరంభ్ం
కొత్త జీవితం ఆరంభం
గైడంగ్ లైట్స
గైడింగ్ లైట్స్
ఆప్నన హసుం
ఆపన్న హస్తం