; డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్
డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్

డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్

డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య బీమా స్కీమ్. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నాణ్యమైన ఆరోగ్య కవరేజి అందిస్తుంది. గతంలో ఆరోగ్యశ్రీగా పిలవబడిన ఈ స్కీమ్ ని 2007లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. జనవరి 2020లో, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రయోజనాలతో ఈ స్కీమును అప్ గ్రేడ్ చేశారు మరియు దీనిని డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ గా తిరిగి పేరు పెట్టడమైనది.

ఆరోగ్య బీమా రంగంలో ఈ స్కీమ్ ప్రత్యేక ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి). పేద రోగుల యొక్క ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఇది అనుకూలంగా తయారుచేయబడింది మరియు ప్రభుత్వ, ప్రైవేట్ రంగం నుంచి సర్వీసు ప్రొవైడర్ల నెట్వర్క్ ద్వారా సెకండరి మరియు టెర్టియరీ కేర్ కింద గుర్తించిన వ్యాధులకు ఎండ్ టు ఎండ్ నగదులేని సేవలు అందిస్తోంది.

రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం గల కుటుంబాలకు మరియు 35 ఎకరాల కంటే తక్కువ భూమి గల (మెట్ట మరియు మాగాణి) ప్రజలు ఈ స్కీముకు అర్హులు. దాదాపు 16,37,230 ఆరోగ్యశ్రీ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి.

ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద, డా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఆరోగ్యరక్ష, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరియు అమ్రుత యోజన లాంటి అనేక పథకాలు ఉన్నాయి.

డాక్టర్ YSR ఆరోగ్యశ్రీతో SVICCAR ఎంప్యానెల్‌మెంట్

మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ మరియు రేడియేషన్ ఆంకాలజీ వంటి అన్ని క్యాన్సర్ పద్ధతులను కవర్ చేయడానికి SVICCAR అక్టోబర్ 15, 2022 నుండి డాక్టర్ YSR ఆరోగ్యశ్రీతో ఎంప్యానెల్ చేయబడింది. SVICCAR ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ నగదు రహిత చికిత్సను అందిస్తుంది. నవంబర్ 2022 నాటికి, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద దాదాపు 500 మంది రోగులు ప్రయోజనం పొందారు.