; మారుప తీసుకురావడం
మారుప తీసుకురావడం
23 జూలై, 2020

మార్పు తీసుకురావడం

ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో సరసమైన ధరకు అందిస్తున్న చికిత్స వి. శైలా తన రొమ్ము క్యాన్సరుపై పోరాడటానికి సహాయపడింది.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన వి. శైలాకు (పేరు మార్చడమైనది) 2019 సంవత్సరంలో రొమ్ము క్యాన్సరు నిర్థారణ అయ్యింది. స్వయంగా పరీక్షించుకుంటున్నప్పుడు ఆమెకు ఎడమ వక్షోజానికి సమీనంలో చంకలో గడ్డ ఉన్నట్లుగా గమనించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈమె సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళగా, గడ్డ యొక్క ఎఫ్ ఎన్ ఎ సితో సహా అనేక రోగనిర్థారణ పరీక్షలు ఆమెకు ఇన్వేజివ్ డక్టల్ కార్సినోమా ఉన్నట్లుగా ధ్రువీకరించాయి. ఇది అత్యంత మామూలు రకం రొమ్ము క్యాన్సర్లలో ఒకటి. దాదాపుగా 80% మందికి ఈ వ్యాధే నిర్థారించబడుతోంది.

అనంతరం శైలాను మరొక ఆసుపత్రికి తరలించగా, ఆమె గడ్డ తొలగింపు సర్జరీ మరియు రెండు కీమోథెరపి సెషన్లు చేయించుకున్నారు. అప్పటికే, ఆమె కుటుంబం పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి చికిత్స యొక్క మిగతా దశలతో కొనసాగేందుకు పోరాడుతున్నారు- ఆరు కీమోథెరపి సెషన్ లు, 17 యాంటీబాడీ ఇంజెక్షన్లు మరియు 5 సెషన్ల రేడియేషన్ థెరపి చేయించుకోవలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సరు కేర్ ఆసుపత్రులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో సదుపాయాలు ఉన్నప్పటికీ ఖరీదైనవి మరియు అత్యధిక మంది రోగులకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. ఫలితంగా, రాష్ట్రంలోని అత్యధిక మంది క్యాన్సరు రోగులు మరియు వాళ్ళ కుటుంబాలు నాణ్యమైన క్యాన్సరు సంరక్షణ పొందడానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోంది. డబ్బు లేని కారణంగా అనేక మంది మధ్యలోనే చికిత్సను నిలిపివేస్తున్నారు.

రాష్ట్రంలో సరసమైన, నాణ్యమైన చికిత్స ఎంపికల కోసం శైలా కుటుంబం అన్వేషించడం ప్రారంభించింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్)కి వెళ్లవలసిందిగా ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు.

 

 

ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ డ కేర్ లో రోగిని ప్రీకీషసుునన డాకిరు
ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ డే కేర్ లో రోగిని పరీక్షీస్తున్న డాక్టరు

 

 

డే కేర్ సదుపాయాలు అందించబడుతున్న ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ క్యాంపస్ లో, యూనిట్ యొక్క డాక్టర్ల టీమ్, నర్సులు మరియు సంరక్షకులు అందిస్తున్న చికిత్స ఆమె కుటుంబాన్ని వెంటనే ఆకట్టుకుంది. ఈమె కీమోథెరపి సెషన్లు మరియు యాంటీబాడీ ఇంజెక్షన్లు పొందారు. ‘‘ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో ఇవ్వబడిన చికిత్స మరియు సంరక్షణ అత్యున్నతంగా ఉంది,’’ అంటున్నారు శైలా.

ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో చికిత్స వ్యయం సహేతుకంగా మరియు వాళ్ళకు అందుబాటులో ఉన్నందున, తిరుపతిలో ఉండి ఆర్థిక భారం లేకుండా చికిత్సను పూర్తిచేయడానికి లేదా మధ్యలో వదిలివెళ్లే ఒత్తిడి లేకుండా ఆమె తిరుపతిలో ఇల్లు అద్దెకు తీసుకోగలిగింది. ‘‘నా ఆఖరి సెషన్ తరువాత ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ ని వదిలివెళుతున్నందుకు నేను ఉద్విగ్న క్షణాలు గడుపుతున్నాను. నాతో మంచి అనుబంధం ఏర్పరచుకున్న సిబ్బందిని వదిలివెళ్లాలంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి’’ అని శైలా గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడు కాకినాడకు తిరిగొచ్చిన శైలా తన మామూలు జీవితం మరియు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారు. ఫాలో అప్ పరీక్షలకు క్రమంతప్పకుండా ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ కి వెళుతున్నారు.

ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
ఆశను కనుగొనడం: గుణశీలన్ కథ
కొత్ు జీవిత్ం ఆరంభ్ం
కొత్త జీవితం ఆరంభం
గైడంగ్ లైట్స
గైడింగ్ లైట్స్