;
తిరుపతి, జనవరి 08, 2021: తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్ష మరియు అవగాహన కియోస్క్ స్వస్త్ చిత్తూర్ ని నెలకొల్పుతున్నట్లు నేడు టాటా ట్రస్ట్స్ ప్రకటించింది. ట్రస్ట్స్ యొక్క క్యాన్సరు విభాగం అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ (ఎసిఎఫ్) యూనిట్ శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఆర్) ఈ కియోస్క్ ని నెలకొల్పింది.
నాన్- కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సి డిలు)- డయాబెటీస్, అధిక రక్త పోటు, మరియు నోటి, రొమ్ము మరియు సెర్వైకల్ క్యాన్సర్లు లాంటివి స్క్రీనింగ్ చేసే పరీక్షలతో పాటు, సాధారణ ఆరోగ్య పరీక్షలు ఒపిడి మరియు ఐపిడి రోగుల సంరక్షకులకు మరియు సందర్శకులకు ఉచితంగా చేయబడతాయి. జీవనశైలి, పోషణ, బహిష్టు ఆరోగ్యం, ప్రసూతి మరియు బిడ్డ ఆరోగ్యంపై సులభంగా అర్థంచేసుకునే రీతిలో ఉచిత ఆరోగ్య సలహా సేవలు కూడా లబ్ధిదారులకు అందించబడతాయి.
కియోస్క్ ని చంద్రగిరి ఎంఎల్ఎ డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. డా. పాల్ సెబాస్టియన్, హెడ్ పిఇపి, క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్, టాటా ట్రస్ట్స్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరోగ్య సేవల జిల్లా కోఆర్డినేటరుతో సహా ఈ ప్రాంత సీనియర్ అధికారులు, టాటా ట్రస్ట్స్, ఎసిఎఫ్ మరియు ఎస్ వి ఐ సి సి ఆర్ టీమ్ సభ్యులు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ లు (ఎన్ సి డి లు) అధిక సంఖ్యలో ఉన్నాయి. 1000 మందిలో 40 మంది వీటితో బాధపడుతున్నారు. రొమ్ము మరియు సెర్వైకల్ లాంటి సులభంగా గుర్తించగల క్యాన్సర్ల స్క్రీనింగ్ రేటు కూడా తక్కువగా ఉంది. ఉదాహరణకు రొమ్ము కర్కరోగం స్క్రీనింగ్ కవరేజి దాదాపు 5% ఉంది. రాష్ట్రానికి సమగ్ర స్క్రీనింగ్ మరియు అవగాహన కార్యక్రమం అవసరం.
‘‘చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రిలో ‘స్వస్త్ చిత్తూర్’ కియోస్క్ ని ప్రారంభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజల్లో అవగాహన స్థాయిలు పెంచడానికి మరియు రెగ్యులరుగా స్క్రీనింగ్ చేయించుకోవడం గురించి ప్రచారం చేయడానికి ఈ కియోస్క్ తప్పకుండా సహాయపడుతుంది. సమగ్ర స్క్రీనింగ్ మరియు అవగాహన సేవలు వివిధ నష్టకారకాలను అవగాహన చేసుకునేందుకు మరియు వీటిని అధిగమించేందుకు సహాయపడతాయి. ఎన్ సి డి లు మరియు నోటి, రొమ్ము మరియు సెర్వైకల్ క్యాన్సరును ముందుగానే కనిపెట్టడానికి మరియు మెరుగ్గా అదుపుచేయడానికి కియోస్క్ సహాయపడుతుందని మరియు సమగ్ర ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తుందని నేను ఆశిస్తున్నాను,’’ అన్నారు డా. చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంఎల్ఎ, చంద్రగిరి.
ఏరియా ఆసుపత్రి రోజువారీ ప్రాతిపదికన సగటున 250 మంది రోగుల అవసరాలు తీర్చుతోంది. రోజువారీ ప్రాతిపదికన కియోస్క్ 40 నుంచి 50 మంది సందర్శకులకు సేవలందించగలుగుతోంది.
‘‘టాటా ట్రస్ట్స్ క్యాన్సర్ కేర్ ప్రోగాములో, దేశంలో క్యాన్సరు సంరక్షణను మార్చడం లక్షంగా మేము పని చేస్తున్నాము. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు లభించేలా చేయడంపై మేము ఫోకస్ పెట్టాము, దీనివల్ల ఏ ఒక్కరు కూడా మధ్యలో చికిత్స వదిలేయకుండా ఉంటారు. ముందుగానే కనిపెట్టడం, సకాలంలో చికిత్స చేయడం మరియు ప్రాణాలను కాపాడటం ద్వారా సులభంగా గుర్తించగలగడం మరియు ఎన్ సి డి లను డౌన్ సైజు చేయడం దిశగా ‘స్వస్త్ చిత్తూరు’ కియోస్క్ వేసిన ఒక అడుగు. ఇది రోగి యొక్క జీవనశైలిని మెరుగుపరచడమే కాకుండా, చికిత్స మరియు సంరక్షణ సంబంధ ఖర్చులను కూడా తగ్గిస్తుంది,’’ అన్నారు డా. సంజీవ్ చోప్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్, క్యాన్సరు కేర్ ప్రోగ్రామ్, టాటా ట్రస్ట్స్.
‘‘అనేక క్యాన్సర్లతో సహా ఎన్ సి డి లకు గల ముఖ్య నష్టాంశాల్లో పొగాకు వినియోగం ఒకటి. జిఎటిఎస్ 2 సర్వే ప్రకారం, రాష్ట్రంలోని ప్రజల్లో 20% మంది (30% మంది పురుషులు మరియు 10% మంది మహిళలు) ఏదో ఒక రూపంలో (పొగ తాగి/పొగ తాగకుండా) పొగాకు వినియోగిస్తున్నారు. పొగాకు మాన్పించడం మరియు నియంత్రించడం కియోస్క్ లో ద్రుష్టిపెట్టే మరియు పరిష్కరించే ముఖ్యమైన వాటిల్లో ఒకటి. పొగాకు యొక్క హానికారక ప్రభావాల గురించి మేము ప్రజలను హెచ్చరిస్తాము. నోటి క్యాన్సరును స్వయంగా కనిపెట్టడ గురించి కూడా లబ్ధిదారులకు చెప్పడం జరుగుతుంది,’’ అని అన్నారు డా. పాల్ సెబాస్టియన్, హెడ్ పిఇపి క్యాన్సరు కేర్ ప్రోగ్రామ్, టాటా ట్రస్ట్స్.
‘‘స్వస్త్ కియోస్కులు’’ ఆసుపత్రికి తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నెలకొల్పబడ్డాయి, దీనివల్ల గరిష్ట సంఖ్యలో సందర్శనలు మరియు రోగుల సంరక్షకులు ఈ సేవల నుంచి ప్రయోజనం పొందుతున్నారు. అస్సాం, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక కియోస్కులు విజయవంతంగా నడుస్తున్నాయి.
‘స్వస్త్ చిత్తూరు’ కియోస్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి మొట్టమొదటి కియోస్క్. కియోస్క్ కార్యకలాపాలను శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) నిర్వహిస్తుంది. తిరుపతి, చిత్తూరు మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు స్క్రీనింగ్ మరియు అవగాహన సేవలు అందించేందుకు మమ్మోగ్రఫి మెషీను ఉన్న మొబైల్ మెడికల్ యూనిట్ ని కూడా ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ నడుపుతోంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అధునాతన సమగ్ర క్యాన్సరు సంరక్షణ ఆసుపత్రి నెలకొల్పడం జరుగుతుంది.
టాటా ట్రస్ట్స్ గురించి
భారతదేశపు అత్యంత పురాతన ధాత్రుత్వ సంస్థ అయిన టాటా ట్రస్ట్స్ 1892లో నెలకొల్పినప్పటి నుంచి, తాను సేవలందిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకోవడంలో అగ్రగామి పాత్ర పోషించింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు జెమ్సెట్జీ టాటా యొక్క సానుకూల ధాత్రుత్వ సిద్ధాంతాలు మరియు విజన్ తో నడుస్తున్న టాటా ట్రస్ట్స్, ఆరో్గ్యం, పోషణ, విద్య, తాగునీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత, జీవనోపాధి, డిజిటల్ రూపాంతరం, మైగ్రేషన్
మరియు అర్బన్ హాబిటట్, సామాజిక న్యాయం మరియు ఇన్ క్లూజన్, పర్యావరణం మరియు ఎనర్జీ, నైపుణ్యాభివ్రుద్ధి, క్రీడలు, కళ మరియు సంస్క్రుతి రగాల్లో అభివ్రుద్ధిని కేటలైజ్ చేయడం ఉద్దేశం. నేరుగా అమలు, భాగస్వామ్యాలు మరియు గ్రాంట్లు ఏర్పాటు ద్వారా సాధించబడుతున్న ట్రస్ట్స్ ప్రోగ్రాములు వినూత్నమైనవి, దేశానికి సంబంధమున్నవి. మరింత సమాచారం కోసం దయచేసి https://tatatrusts.org/చూడండి.
- లింక్డ్ ఇన్
- టాటా ట్రస్ట్స్ ట్విట్టర్
- @tatatrusts Facebook: టాటా ట్రస్ట్స్
- ఇన్ స్టా గ్రామ్: టాటా ట్రస్ట్స్