; తిరుపతిలో నెలకొల్పిన శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ని (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) ముఖ్యమంత్రి ప్రారంభించారు.
తిరుపతిలో నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్
22 మే, 2022

తిరుపతిలో నెలకొల్పిన శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ని (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) ముఖ్యమంత్రి ప్రారంభించారు.

  • ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ కోసం అత్యాధునిక రోగనిర్ధారణ మరియు చికిత్స సాంకేతికత ఉంది
  • ఏటా ప్రాంతంలోని 5000 మంది క్యాన్సర్ రోగులు మరియు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే సౌకర్యాలు కలిగిఉంది.

తిరుపతి, మే 05, 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన రెడ్డి నేడు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ని (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వై. వి. సుబ్బారెడ్డి, చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టిటిడి), డా. కె. ఎస్. జవహర్ రెడ్డి, ఐఎఎస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టిటిడి, శ్రీ ఎన్. శ్రీనాథ్, టాటా ట్రస్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ), డా. సంజయ్ చోప్రా, ఎసిఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు టిటిడి, అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ మరియు టాటా ట్రస్ట్స్ కి చెందిన ఇతర ముఖ్యులు హాజరయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టిటిడి) భాగస్వామ్యంతో టాటా ట్రస్ట్స్ మద్దతుతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ (ఎసిఎఫ్) ఈ ఆసుపత్రిని నెలకొల్పింది. దీని నిర్మాణానికి టిటిడి భూమి కేటాయించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన యంత్రాంగం యొక్క మద్దతు ఇచ్చింది. ట్రస్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ క్యాన్సరు సంరక్షణ మోడల్ ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ కి మార్గదర్శనం చేస్తోంది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘టిటిడి మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కొలాబరేషన్ ఏర్పాటు చేసుకునేందుకు టాటా ట్రస్ట్స్‌ ముందుకొచ్చినందుకు మేము గర్వపడుతున్నాము మరియు సంతోషిస్తున్నాము. ఇది తిరుపతిలో కలకాలం ఉండిపోయే కళాఖండం. టిటిడి కూడా తన శక్తి మరియు శ్రమను వినియోగించింది. ఇప్పుడు వైద్య సేవలపై కూడా టిటిడి ద్రుష్టిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది’’.

టాటా ట్రస్ట్స్చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శ్రీనాథ్ మాట్లాడుతూ, ‘‘క్యాన్సరు చికిత్సను పెంచవలసిన మరియు భరించగల స్థితిలో ఉంచవలసిన అవసరం ఉంది, డిస్ట్రిబ్యూడెడ్ సంరక్షణ మోడల్ ద్వారా ఇలా చేయడానికి ట్రస్ట్స్‌ పనిచేస్తోంది. ముందుగానే స్క్రీనింగ్ చేయడం, అధునాతన మౌలికసదుపాయాలు మరియు బాగా శిక్షణ పొందిన మెడికల్ ఆంకో- ప్రాక్టీషనర్ల ద్వారా విలువైన జీవితాలను కాపాడవచ్చని మేము నమ్ముతున్నాము. అనేక మందికి, ప్రత్యేకించి సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలకు ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ ఉపశహనం మరియు సంరక్షణ అందించగలదని మేము ఆశాభావంతో ఉన్నాము.’’

డా. సంజీవ్ చోప్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్, క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్, టాటా ట్రస్ట్స్ఇలా అన్నారు, ‘‘క్యాన్సర్ కేర్ ప్రోగ్రాములో మేము హోలిస్టిక్ కేర్ పై ద్రుష్టిపెడుతున్నాము. వ్యాధి నిర్థారణ చేయడానికి ముందు ఇది ప్రారంభమై జీవితం ముగింపు సంరక్షణ వరకు కొనసాగుతుంది. క్యాన్సరును ముందుగానే కనిపెట్టేందుకు చైతన్యం మరియు స్క్రీనింగ్ కోసం ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో మేము నేషనల్ హెల్త్ మిషన్ తో పనిచేస్తున్నాము. మా పాలటివ్ కేర్ టీమ్ ద్వారా, టెర్మినల్ క్యాన్సరు రోగుల జీవనశైలిని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లో ఉన్న మా నిబద్ధత మరియు సుశిక్షితులైన టీమ్ ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన క్యాన్సరు సంరక్షణ అందించాలని యోచిస్తోంది.’’

డా. రమణన్, మెడికల్ డైరెక్టర్, ఎస్ వి సి సి ఆర్ మాట్లాడుతూ, ‘‘ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ లోని ప్రజ్ఞావంతులైన టీమ్ కరుణతో ఈ ప్రాంతంలోని క్యాన్సరు రోగులకు అవసరమైన సమర్థవంతమైన సంరక్షణ కల్పిస్తుందన్న విశ్వాసం నాకు ఉంది.’’

భారతదేశంలో క్యాన్సరు సంరక్షణ సదుపాయాలు పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. దీంతో రోగులు తప్పనిసరిగా ఈ కేంద్రాలకు వచ్చి, అధిక ఖర్చు భరించవలసి వస్తోంది, అనేక మంది ఈ చికిత్స వ్యయం భరించలేకపోతున్నారు. టాటా ట్రస్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ క్యాన్సర్ కేర్ మోడల్ (డిసిసిఎం) ఈ లోపాలను నిర్మూలించి ప్రపంచ శ్రేణి చికిత్సను రోగులు నివసించే ప్రాంతాలకు చేరువగా తీసుకొచ్చి, భరించగలిగేలా చేస్తోంది.

ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ అనేది క్యాన్సరు నిర్థారణ మరియు చికిత్సకు అత్యాధునిక పరికరాలు మరియు టెక్నాలజీ గల సమగ్ర క్యాన్సరు సంరక్షణ సదుపాయం. దీనిలో అత్యాధునిక సిటి స్కాన్ మరియు ఎంఆర్ఐ స్కానరుతో సహా మంచి లేబొరేటరీ మరియు రోగనిర్థారణ పరికరాలు ఉన్నాయి. కీమోథరపి ఇచ్చేందుకు సమర్థులైన మెడికల్ ఆంకాలజీ టీమును నియమించడమైనది. అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్ మరియు బ్రాకీథెరపిని ఉపయోగించి రేడియో థెరపి ఇవ్వబడుతోంది. ఓపెన్ మరియు మినిమల్ యాక్సెస్ సర్జరీలు చేసేందుకు ఆసుపత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.

క్యాన్సరు రోగులు సరసమైన ధరలకు ఈ సేవలు పొందగలుగుతారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు వైద్యం అందించేందుకు ఈ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ మరియు ఇతర ప్రభుత్వ పథకాలతో ఎంప్యానల్ కాబోతున్నది.

టాటా ట్రస్ట్స్‌ 2017 నుంచి డిస్ట్రిబ్యూటెడ్ క్యాన్సరు కేర్ మోడల్ ద్వారా ఆరు రాష్ట్రాల్లో 20కి పైగా ఆసుపత్రులు ఉన్నాయి. వీటిని అభివ్రుద్ధి చేస్తోంది మరియు పెంచుతోంది. నెట్ వర్కును అమలు చేసేందుకు ఈ సంస్థ వివిధ రాష్ట్రాలతో మరియు భావ సారూప్యత గల సంస్థలతో కొలాబరేషన్ కలిగివుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మే 5, 2022న అస్సాంలో ఏడు క్యాన్సరు చికిత్స సదుపాయాలను ప్రారంభించారు. ఎక్కువ పట్టణాలు మరియు నగరాలకు సరసమైన ధరకు క్యాన్సరు చికిత్సను విస్తరించేందుకు రాష్ట్ర వ్యాప్త, మల్టీ-లెవెల్ క్యాన్సరు కేర్ నెట్వర్క్ లో భాగంగా వీటిని ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో మరొక ఏడు సదుపాయాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రెండవ దశలో నెట్వర్క్ లో చేరుతుంది.

టాటా ట్రస్ట్స్ గురించి

భారతదేశపు అత్యంత పురాతన ధాత్రుత్వ సంస్థ అయిన టాటా ట్రస్ట్స్ 1892లో నెలకొల్పినప్పటి నుంచి, తాను సేవలందిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకోవడంలో అగ్రగామి పాత్ర పోషించింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు జెమ్సెట్జీ టాటా యొక్క సానుకూల ధాత్రుత్వ సిద్ధాంతాలు మరియు విజన్ తో నడుస్తున్న టాటా ట్రస్ట్స్, ఆరో్గ్యం, పోషణ, విద్య, తాగునీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత, జీవనోపాధి, డిజిటల్ రూపాంతరం, మైగ్రేషన్ మరియు అర్బన్ హాబిటట్, సామాజిక న్యాయం మరియు ఇన్ క్లూజన్, పర్యావరణం మరియు ఎనర్జీ, నైపుణ్యాభివ్రుద్ధి, క్రీడలు, కళ మరియు సంస్క్రుతి రంగాల్లో అభివ్రుద్ధిని కేటలైజ్ చేయడం ఉద్దేశం. నేరుగా అమలు, భాగస్వామ్యాలు మరియు గ్రాంట్లు ఏర్పాటు ద్వారా సాధించబడుతున్న ట్రస్ట్స్‌ ప్రోగ్రాములు వినూత్నమైనవి, దేశానికి సంబంధమున్నవి. మరింత సమాచారం కోసం దయచేసి https://tatatrusts.org/చూడండి.

- లింక్డ్‌ ఇన్
- టాటా ట్రస్ట్స్ ట్విట్టర్
- @tatatrusts Facebook: టాటా ట్రస్ట్స్
- ఇన్ స్టా గ్రామ్: టాటా ట్రస్ట్స్

తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో ‘స్వస్త్ చిత్తూర్’ స్క్రీనింగ్ కియోస్క్ ని టాటా ట్రస్ట్స్ నెలకొల్పింది.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో ‘స్వస్త్ చిత్తూర్’ స్క్రీనింగ్ కియోస్క్ ని టాటా ట్రస్ట్స్ నెలకొల్పింది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఆర్)లో టాటా ట్రస్ట్స్ వారి మామోగ్రఫీ యంత్రం  గల మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు).
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఆర్)లో టాటా ట్రస్ట్స్ వారి మామోగ్రఫీ యంత్రం గల మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు).
టాటా ట్రస్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.
టాటా ట్రస్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.