;
తిరుపతి, నవంబరు 03, 2020: తన స్పెషల్ పర్పస్ వెహికల్ అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ (ఎసిఎఫ్) ద్వారా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్)లో ‘మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు)’ ప్రారంభిస్తున్నట్లుగా టాటా ట్రస్ట్స్ నేడు ప్రకటించింది. నాన్- కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సి డిలు)- డయాబెటీస్, అధిక రక్త పోటు, మరియు నోటి, రొమ్ము మరియు సెర్వైకల్ క్యాన్సర్లు లాంటి వాటికి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలతో పాటు, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు తిరుపతి, చిత్తూరు, మరియు పరిసర మారుమూల ప్రాంతాల ప్రజలకు ఉచితంగా అందించబడతాయి.
మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఎంఎంయులో మమ్మోగ్రఫి మెషీన్ ఉంది. క్లినికల్ రొమ్ము పరీక్ష చేసిన మీదట రిస్కు ఎక్కువగా ఉన్నట్లుగా వెల్లడైన ప్రజలకు ఏర్పాటు చేయడమైనది. క్యాన్సరు, డయాబెటీస్, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ (ఎన్ పి సి డి సి ఎస్) నిరోధకత మార్గదర్శకాలకు జాతీయ కార్యక్రమం ప్రకారం స్క్రీనింగ్ పరీక్షలు చేయబడతాయి. 30 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల లబ్ధిదారులకు జీవనశైలి, పోషణ, మరియు వివిధ ఆరోగ్య సంబంధ అంశాలపై కూడా ఆరోగ్య సలహా సేవలు అందించబడతాయి. శిక్షణ పొందిన వైద్య మరియు సాంకేతిక ప్రొఫెషనల్స్ గల టీమ్ నిర్వహిస్తున్న ఎంఎంయు ఇప్పటికే చంద్రగిరిలో శిబిరం నిర్వహిస్తోంది.
ఎంఎంయు ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. సంజీవ్ చోప్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్, క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్, టాటా ట్రస్ట్స్ మాట్లాడుతూ, ‘‘మన దేశంలో రొమ్ము క్యాన్సరు పెరుగుతోంది మరియు అత్యధిక కేసుల్లో వ్యాధి అప్పటికే ముదిరిన తరువాత నిర్థారణ చేయబడుతోంది, అంటే స్టేజ్ 3 లేదా 4లో. కాబట్టి, రొమ్ము కర్కరోగం స్క్రీనింగ్ ప్రక్రియలు మరియు ముందుగానే కనిపెట్టడంపై ద్రుష్టిసారించడం అత్యావశ్యం. మహిళ లేదా ఆమె యొక్క ప్రాథమిక సంరక్షణ అందించేవారు అనుమానాస్పద లెజన్లను అనుభూతి చెందడానికి ముందు మమ్మోగ్రాములు సాధారణంగా వాటిని కనిపెట్టగలవు. క్రమంతప్పకుండా స్క్రీనింగు చేయించుకునేందుకు మహిళల్లో రొమ్ము క్యాన్సరు వల్ల కలిగే మరణాలను 25 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధన వెల్లడించింది.’’
‘‘రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న రొమ్ము, సెర్వైకల్, నోటి మరియు ఎన్ సి డి వ్యాధులు లాంటి మామూలు క్యాన్సర్లను తగ్గించేందుకు ఈ యూనిట్ ముఖ్యమైన అడుగు. తమ స్థితి గురించి తెలియకుండా, ఎన్ సి డిలతో బాధపడుతున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను గుర్తించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు) సురక్షితమైనదిగా మరియు సౌకర్యవంతమైన సెక్షన్లుగా స్పష్టంగా నిర్వచించడమైనది, స్క్రీన్ చేయించుకునేలా లబ్ధిదారులకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలకుస్నేహపూర్వకమైన అనుభవం కల్పిస్తుంది, తద్వారా ఎన్ సిడిలను, ప్రత్యేకించి రొమ్ము క్యాన్సరును ముందుగానే కనిపెట్టే అవకాశాలను పెంచుతోంది, ’’ అన్నారు డా. నాగేశ్వర రెడ్డి, మెడికల్ ఆంకాలజిస్టు, ఎస్ వి ఐ సి సి ఎ ఆర్.
తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టిటిడి)తో 2017లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత టాటా ట్రస్ట్స్, క్యాన్సరును కనిపెట్టేందుకు సరసమైన, అందుబాటులో ఉన్న మరియు అత్యధిక నాణ్యమైన చికిత్స మరియు స్క్రీనింగ్ అందించే తన క్యాన్సరు సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ (ఎసిఎఫ్) నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ లో రోగుల ఇళ్ళకు చేరువగా సమగ్ర మరియు సరసమైన ధరకు క్యాన్సరు సంరక్షణ అందించేందుకు ఎస్ వి ఐ సి సి ఎ ఆర్ ని ఎసిఎఫ్ అభివ్రుద్ధి చేస్తోంది. కళా కేంద్రం చాలా వరకు అభివ్రుద్ధి దశలో ఉండగా, చిత్తూరు మరియు పరిసర జిల్లాల్లోని అణగారిన వర్గాల ప్రజలకు సేవలందించేందుకు డే కేర్ కీమోథెరపి సెంటర్ ని నెలకొల్పడమైనది. ప్రజా ఆరోగ్య సేవలు కూడా ప్రారంభించబడ్డాయి. సంపూర్ణంగా అభివ్రుద్ధి చేసిన సదుపాయంలో ఆధునిక సాంకేతిక వ్యవస్థలు ఉన్నాయి, పునర్నిర్మాణ సపోర్టు మరియు పాలిటివ్ కేర్ లాంటి సపోర్టు సేవల ద్వారా ఏకీక్రుతం చేయడమైనది.
టాటా ట్రస్ట్స్ గురించి
భారతదేశపు అత్యంత పురాతన ధాత్రుత్వ సంస్థ అయిన టాటా ట్రస్ట్స్ 1892లో నెలకొల్పినప్పటి నుంచి, తాను సేవలందిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకోవడంలో అగ్రగామి పాత్ర పోషించింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు జెమ్సెట్జీ టాటా యొక్క సానుకూల ధాత్రుత్వ సిద్ధాంతాలు మరియు విజన్ తో నడుస్తున్న టాటా ట్రస్ట్స్, ఆరో్గ్యం, పోషణ, విద్య, తాగునీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత, జీవనోపాధి, డిజిటల్ రూపాంతరం, మైగ్రేషన్ మరియు అర్బన్ హాబిటట్, సామాజిక న్యాయం మరియు ఇన్ క్లూజన్, పర్యావరణం మరియు ఎనర్జీ, నైపుణ్యాభివ్రుద్ధి, క్రీడలు, కళ మరియు సంస్క్రుతి రగాల్లో అభివ్రుద్ధిని కేటలైజ్ చేయడం ఉద్దేశం. నేరుగా అమలు, భాగస్వామ్యాలు మరియు గ్రాంట్లు ఏర్పాటు ద్వారా సాధించబడుతున్న ట్రస్ట్స్ ప్రోగ్రాములు వినూత్నమైనవి, దేశానికి సంబంధమున్నవి. మరింత సమాచారం కోసం దయచేసి https://tatatrusts.org/చూడండి.
- లింక్డ్ ఇన్
- టాటా ట్రస్ట్స్ ట్విట్టర్
- @tatatrusts Facebook: టాటా ట్రస్ట్స్
- ఇన్ స్టా గ్రామ్: టాటా ట్రస్ట్స్