; టాటా ట్రస్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.
టాటా ట్రస్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర
31 ఆగస్టు, 2018

టాటా ట్రస్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.

తిరుపతి ఆగస్టు 31, 2018: తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టిడిడి) మరియు టాటా ట్రస్ట్స్ 300 పడకల క్యాన్సర్ కేర్ సదుపాయం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ రతన్ టాటా, చైర్మన్, టాటా ట్రస్ట్స్, శ్రీ ఆర్ కె క్రిష్ణ కుమార్, ట్రస్టీ, టాటా ట్రస్ట్స్, శ్రీ ఆర్. వెంకటరమణన్, మేనేజింగ్ ట్రస్టీ, టాటా ట్రస్ట్స్, శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మరియు డా. పి. నారాయణ మూర్తి, డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

శ్రీ రతన్ ఎన్, టాటా, చైర్మన్ టాటా ట్రస్ట్స్

శ్రీ రతన్ ఎన్, టాటా, చైర్మన్ టాటా ట్రస్ట్స్

 

గత సంవత్సర టిటిడితో ఎంఒయు కుదుర్చుకున్న తరువాత, క్యాన్సరును కనిపెట్టేందుకు సరసమైన ధరకు, అందుబాటులో మరియు అత్యధిక నాణ్యమైన చికిత్సను అందించే ఉద్దేశంతో తన క్యాన్సర్ కేర్ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ (ఎసిఎఫ్) అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ని ట్రస్ట్స్ నెలకొల్పింది. శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ అనేది రోగులకు దగ్గరగా సమగ్ర మరియు సరసమైన క్యాన్సర్ కేర్ ని నెలకొల్పిన సదుపాయం. దేశ వ్యాప్తంగా రేడియేషన్ థెరపి రిఫరల్స్ ని కూడా ఆకర్షిస్తూనే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు మరియు పరిసర జిల్లాల్లోని రోగుల అవసరాలను ఈ కేంద్రం తీర్చుతుంది. ఈ సెంటరును ఎసిఎఫ్ డిజైన్, ప్రణాళిక, నెలకొల్పడం, ఆపరేట్ చేయడం చేస్తుంది.

జూన్ 2019 నుండి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతో కేంద్రం పని చేయనుంది. రోగి నిరీక్షణ సమయాన్ని సున్నాకి తగ్గించే లక్ష్యంతో, కేంద్రం 20 లీనియర్ యాక్సిలరేటర్లను (LINACs) కలిగి ఉంటుంది, ఈ సామర్థ్యం దశలవారీగా అభివృద్ధి చేయబడింది. ఈ సదుపాయం ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, పునర్నిర్మాణ మద్దతు, ఉపశమన సంరక్షణ మరియు పునరావాసం వంటి సహాయక సేవల ద్వారా సమగ్ర సంరక్షణతో కూడి ఉంటుంది. ఈ ప్రాంగణం రోగులకు మరియు వారి సంరక్షకులకు డార్మిటరీలలో వసతి కల్పిస్తుంది, దేశంలోని ప్రాంతాల నుండి ప్రయాణించే వారి జేబు ఖర్చులను తగ్గించడానికి.

ఈ సందర్భంగా, శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘దేశంలోని అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో శ్రీ టాటా ఒకరు. అణగారిన వర్గాల ప్రజలకు సహాయపడేందుకు ముందుకొచ్చిన మొట్టమొదటి దాతల్లో ఇతను ఎల్లప్పుడూ ఒకరిగా ఉన్నారు. ఈ పవిత్రమైన తిరుపతి పట్టణంలో, ఇంత పెద్ద ఆసుపత్రిని నిర్మించినందుకు మేము గర్వపడుతున్నాము. దేశంలోని ప్రతి ఒక్కరికి ఇది రేడియేషన్ థెరపి, హోలిస్టిక్ సంరక్షణ మరియు క్యాన్సర్ కేర్ పై అధునాత పరిశోధన అందించే కేంద్రం అవుతుంది. టాటా ట్రస్ట్స్ కి చెందిన క్యాన్సర్ కేర్ నిపుణుల సహాయంతో, దక్షిణ భారతదేశం మొత్తంలో క్యాన్సరు కేర్ కి క్యాపిటల్ అవుతుంది. జాతీయ క్యాన్సరు గ్రిడ్ కి కనెక్ట్ చేయబడిన ఇది, రీజియన్ లోని ఇతర చిన్న కేంద్రాలను కలుపుతుంది.’’

శ్రీ రతన్ ఎన్. టాటా మాట్లాడుతూ, ‘‘దేశంలో క్యాన్సరు కేర్ కి చేసిన క్రుషికి మద్దతు ఇచ్చేందుకు టాటా ట్రస్ట్స్ నిబద్ధమై ఉన్నాయి. క్యాన్సరు చికిత్సను మెరుగుపరచడానికి, జీవించే రేట్లను పెంచడానికి, ఏదో ఒక రోజుకు వ్యాధిని నయం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ ప్రాంతంలోని క్యాన్సరు రోగులకు ప్రథమ శ్రేణి ఇచికత్సను అందించే సదుపాయాన్ని కల్పించేందుకు ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు మేము తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ కి బాగా రుణపడి ఉన్నాము.’’

శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, “తిరుపతి రాష్ట్రాన్ని మరియు నగరాన్ని అభివృద్ధి చేయడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రీచంద్రబాబు నాయుడుకు మరియు భారతదేశంలోనే అత్యంత చారిటబుల్ ట్రస్ట్ అయిన టాటా ట్రస్ట్‌ల చైర్మన్ శ్రీ రతన్ టాటాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంలో సహాయం చేసినందుకు. మేము ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చాము మరియు దీనిని ఏర్పాటు చేయడానికి శ్రీ టాటా ముందుకు రావడం నాకు సంతోషకరం. ఈ ప్రాంతంలో ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి ఆసుపత్రి సహాయం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.

టాటా ట్రస్ట్స్ 1942 నుంచి క్యాన్సర్ కేర్ మౌలికసదుపాయాలను అభివ్రుద్ధి చేయడంలో అగ్రగామిగా ఉంది. ముంబయిలో టాటా మెమోరియల్ ఆసుపత్రిని నెలకొల్పింది. ఇటీవల, అంటే 1911లో కోల్ కతాలో టాటా మెడికల్ సెంటర్ ని నెలకొల్పింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న, ట్రస్ట్స్ సమగ్ర క్యాన్సర్ కేర్ నెట్వర్క్ నెలకొల్పడంపై పని చేస్తోంది. ఇటీవల, 19 రాబోవు ఆధునిక క్యాన్సర్ కేర్ సదుపాయాలను ఆపరేట్ చేసేందుకు అస్సాం ప్రభుత్వంతో టాటా ట్రస్ట్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది మరియు నాగాలాండ్ ప్రభుత్వం 5 జిల్లా ఆసుపత్రులు అభివ్రుద్థి చేస్తోంది. ఇలాంటి నెట్ వర్కులు నెలకొల్పేందుకు ట్రస్ట్స్ ప్రస్తుతం ఒడిశా మరియు తెలంగాణ లాంటి వివిధ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి
TTD అనేది ఆలయాల సమ్మేళనం, ఇది 1987 చట్టం 30లోని మొదటి షెడ్యూల్ 2 క్రింద తీసుకురాబడింది. ధర్మకర్తల మండలి ప్రభుత్వంచే నియమించబడిన సభ్యులచే ఏర్పాటు చేయబడుతుంది. TTD 12 దేవాలయాలు మరియు వాటి ఉప-క్షేత్రాలను నిర్వహిస్తుంది మరియు సుమారు 14,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. తిరుమల, తిరుపతికి వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు టీటీడీ తనను తాను అంకితం చేసుకుంది. ఇది వారి తీర్థయాత్రను ఒక ప్రత్యేకమైన మరియు రివార్డింగ్ ఆధ్యాత్మిక అనుభవంగా మార్చడానికి సౌకర్యాలను అందిస్తుంది. పవిత్రమైన తిరుమల-తిరుపతి ప్రాంతం యొక్క ప్రశాంతత మరియు పవిత్రతను కాపాడేందుకు కూడా ఇది పనిచేస్తుంది. టిటిడి ప్రజల సామాజిక, ఆర్థిక, మతపరమైన మరియు పర్యావరణ అవసరాలపై, ముఖ్యంగా నిరుపేదల పట్ల ఎల్లప్పుడూ స్పృహతో ఉంటుంది. ఇది అనేక కార్యకలాపాలను చేపట్టింది మరియు ఈ ప్రాంతాల్లో వివిధ పథకాలను ప్రారంభించింది. TTD క్యాన్సర్ మరియు హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కొత్త దృష్టిని కలిగి ఉంది మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది

టాటా ట్రస్ట్స్ గురించి
భారతదేశపు అత్యంత పురాతన ధాత్రుత్వ సంస్థ అయిన టాటా ట్రస్ట్స్ 1892లో నెలకొల్పినప్పటి నుంచి, తాను సేవలందిస్తున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకోవడంలో అగ్రగామి పాత్ర పోషించింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు జెమ్సెట్జీ టాటా యొక్క సానుకూల ధాత్రుత్వ సిద్ధాంతాలు మరియు విజన్ తో నడుస్తున్న టాటా ట్రస్ట్స్, ఆరో్గ్యం, పోషణ, విద్య, తాగునీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత, జీవనోపాధి, డిజిటల్ రూపాంతరం, మైగ్రేషన్ మరియు అర్బన్ హాబిటట్, సామాజిక న్యాయం మరియు ఇన్ క్లూజన్, పర్యావరణం మరియు ఎనర్జీ, నైపుణ్యాభివ్రుద్ధి, క్రీడలు, కళ మరియు సంస్క్రుతి రగాల్లో అభివ్రుద్ధిని కేటలైజ్ చేయడం ఉద్దేశం. నేరుగా అమలు, భాగస్వామ్యాలు మరియు గ్రాంట్లు ఏర్పాటు ద్వారా సాధించబడుతున్న ట్రస్ట్స్‌ ప్రోగ్రాములు వినూత్నమైనవి, దేశానికి సంబంధమున్నవి. మరింత సమాచారం కోసం దయచేసి https://tatatrusts.org/చూడండి.

సోషల్ మీడియా
ట్విట్టర్: @tatatrusts
ఫేస్ బుక్: Tata Trusts
ఇన్ స్టా గ్రామ్: tata_trusts

మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి:
టాటా ట్రస్ట్స్
బాబ్ జాన్
ఈమెయిల్: bjohn@tatatrusts.org
మొబైల్: +91 7506366446

యాడ్ ఫ్యాక్టర్స్ పిఆర్
నికితా క్రాస్తా
ఈమెయిల్: Nikita.crasta@adfactorspr.com
మొబైల్: +91 9821071527

తిరుపతిలో నెలకొల్పిన శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ని (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) ముఖ్యమంత్రి ప్రారంభించారు.
తిరుపతిలో నెలకొల్పిన శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ని (ఎస్ వి ఐ సి సి ఎ ఆర్) ముఖ్యమంత్రి ప్రారంభించారు.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో ‘స్వస్త్ చిత్తూర్’ స్క్రీనింగ్ కియోస్క్ ని టాటా ట్రస్ట్స్ నెలకొల్పింది.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో ‘స్వస్త్ చిత్తూర్’ స్క్రీనింగ్ కియోస్క్ ని టాటా ట్రస్ట్స్ నెలకొల్పింది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఆర్)లో టాటా ట్రస్ట్స్ వారి మామోగ్రఫీ యంత్రం  గల మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు).
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ (ఎస్ వి ఐ సి సి ఆర్)లో టాటా ట్రస్ట్స్ వారి మామోగ్రఫీ యంత్రం గల మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు).